![]() |
![]() |
.webp)
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం.. ఇలా దక్షిణాది భాషలన్నింటిలోనూ కథానాయికగా సందడి చేసింది కేథరిన్ ట్రెసా. అయితే, ఎక్కడ కూడా స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయిందీ ముద్దుగుమ్మ. ఉన్నంతలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో చెప్పుకోదగ్గ గుర్తింపుని తెచ్చుకుంది కేథరిన్.
ఇదిలా ఉంటే, ఆ మధ్యంతా కోలీవుడ్ పైనే ఫోకస్ పెట్టిన కేథరిన్.. రీసెంట్ టైమ్స్ లో మళ్ళీ టాలీవుడ్ వైపు దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. వరుసగా మూడు సినిమాలతో ఇక్కడ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ మూడు చిత్రాలు కూడా వరుస నెలల్లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. జూన్ సెకండాఫ్ లో శ్రీవిష్ణుతో జతకట్టిన `భళా తందనాన` విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. జూలై 8న నితిన్ కి జోడీగా నటించిన `మాచర్ల నియోజక వర్గం` తెరపైకి రాబోతోంది. అలాగే ఆగస్టు 5న నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ఆడిపాడిన `బింబిసార` సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది. మరి.. వరుస నెలల్లో వినోదాలు పంచనున్న ఈ చిత్ర త్రయాలతో కేథరిన్ ట్రెసా ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతుందో చూడాలి.
![]() |
![]() |