![]() |
![]() |

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లెఫ్ట్నెంట్ రామ్ గా దుల్కర్ కనిపించనున్నాడు. 'యుద్ధంతో రాసిన ప్రేమ కథ' అనే క్యాప్షన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ సర్ ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది.
దుల్కర్, హను కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో రష్మిక మందన్న నటిస్తోంది. ఈరోజు(ఏప్రిల్ 5) రష్మిక పుట్టినరోజు కావడంతో ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో అఫ్రీన్ అనే ముస్లిం యువతి పాత్రలో రష్మిక నటిస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ ని వదిలారు. పోస్టర్ లో రష్మిక లుక్ ఆకట్టుకుంటోంది. ఇటీవల 'పుష్ప ది రైజ్'లో శ్రీవల్లిగా మెప్పించిన రష్మిక.. ఆ తర్వాత 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాతో నిరాశపరిచింది. మరి ఇప్పుడు అఫ్రీన్ గా కొత్తగా కనిపిస్తున్న రష్మిక ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

ఈ సినిమాను తెలుగు, మలయాళ భాషలతో పాటు తమిళ్ లోనూ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |