![]() |
![]() |

ప్రస్తుతం తాను ఆరు సినిమాలకు డైలాగ్స్ రాస్తున్నాననీ, సొంత కథలు రాసుకోవడానికి టైమ్ లభించడం లేదనీ రచయిత బుర్రా సాయిమాధవ్ అంటున్నారు. యస్.యస్. రాజమౌళి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'ఆర్ఆర్ఆర్' మూవీ డైలాగ్ రైటర్‌గా మరోసారి ఆయన పేరు మారుమోగిపోతోంది. అందులో జూనియర్ ఎన్టీఆర్‌కు ఆయన రాసిన "తొక్కుకుంటూ పోవాలె" అనే డైలాగ్ అయితే వైరల్‌గా మారింది. తెలుగువన్ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఇప్పట్లో దర్శకత్వం వహించే ఆలోచన ఏదీ లేదని చెప్పారు.
"నా దగ్గర బోలెడన్ని ఐడియాస్ ఉన్నాయ్. మైండ్‌లో చాలా వర్క్ జరిగిన కథలు కూడా ఉన్నాయ్. సీరియస్‌గా కథ మీద కూర్చోవాలంటే నెలరోజులు టైమ్ తీసుకోవాలి. అన్ని పనులూ ఆపేసి, ఒక్క కథమీదే కూర్చొనే పరిస్థితి ప్రస్తుతం నాకు లేదు. ఆరు సినిమాలకు డైలాగ్స్ రాస్తున్నాను. సో.. కథ మీద కూర్చోవాలంటే టైమేది? కనీసం వారానికి నాలుగు రోజులన్నా కథకి కేటాయించాలి. ప్రస్తుతానికి ఆ టైమ్ లేదు. కానీ ఎప్పటికైనా ఇస్తా" అని ఆయన తెలిపారు.
"ఇప్పటిదాకా ఎవరూ కథలు అడగలేదా?" అనే ప్రశ్నకు, "కచ్చితంగా అడుగుతుంటారు. కానీ టైమ్ లేకనే చెప్పడం లేదు" అని వెల్లడించారు సాయిమాధవ్. తనను రచయితగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ క్రిష్ కూడా తనను ఎన్నోసార్లు కథల గురించి అడిగారనీ, కానీ టైమ్ లేకనే చెప్పలేదనీ ఆయన తెలిపారు.
![]() |
![]() |