![]() |
![]() |
.webp)
తెలుగునాట ప్రస్తుతం హవా సాగిస్తున్న యువ కథానాయికల్లో కృతి శెట్టి ఒకరు. `ఉప్పెన`, `శ్యామ్ సింగ రాయ్`, `బంగార్రాజు` చిత్రాలతో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, `మాచర్ల నియోజకవర్గం`, `ద వారియర్` సినిమాలతో టాలీవుడ్ లో ఇప్పుడు యమ బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే, 2022 జూలై కృతి శెట్టికి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. కేవలం వారంలోపే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో డబుల్ ధమాకా ఇవ్వనుంది కృతి. ఆ వివరాల్లోకి వెళితే.. యూత్ స్టార్ నితిన్ కి జోడీగా కృతి నటించిన `మాచర్ల నియోజకవర్గం` జూలై 8న రిలీజ్ కాబోతోంది. ఆపై వారంలోపే అంటే జూలై 14న ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి జంటగా సందడి చేయనున్న `ద వారియర్` విడుదల కానుంది. మరి.. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ సినిమాలతో కృతి శెట్టి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
కాగా, `మాచర్ల నియోజకవర్గం`తో ఎమ్మెస్ రాజశేఖర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. తెలుగు - తమిళ భాషల్లో రూపొందుతున్న బైలింగ్వల్ మూవీ `ద వారియర్`ని కోలీవుడ్ కెప్టెన్ లింగుస్వామి డైరెక్ట్ చేస్తున్నాడు.
![]() |
![]() |