![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం కాబోతున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్ ని, కళ్యాణ్ లుక్ ని రివీల్ చేశారు.
'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్.. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం తేజ సజ్జాతో 'హనుమాన్' అనే సూపర్ హీరో ఫిల్మ్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీని ప్రైమ్ షో బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడిదే నిర్మాత ప్రశాంత్ తో మరో పాన్ ఇండియా మూవీ చేస్తుండగా.. అందులో మరో నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ హీరోగా నటిస్తుండటం విశేషం.

'కేజీఎఫ్' మూవీతో 'అధీరా' పేరు ప్రేక్షల్లోకి బలంగా వెళ్ళింది. ఇప్పుడిదే టైటిల్ తో మూవీ రాబోతోంది. 'అధీరా' నుంచి కళ్యాణ్ లుక్ తాజాగా రివీల్ చేశారు. అంతేకాదు పాత్రను పరిచయం చేస్తూ ఆర్ఆర్ఆర్ టీమ్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి చేతుల మీదుగా ఒక టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. 'అధీరా'గా కళ్యాణ్ లుక్ ఆకట్టుకుంటోంది. లుక్ ని బట్టి చూస్తే ఇది కూడా సూపర్ హీరో ఫిల్మ్ అని అర్థమవుతోంది. మరి ఈ వరుస పాన్ ఇండియా సూపర్ హీరో ఫిలిమ్స్ తో ప్రశాంత్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

![]() |
![]() |