![]() |
![]() |

'రాధేశ్యామ్' మూవీ కలెక్షన్స్ రోజురోజుకి పడిపోతున్నాయి. ఫస్ట్ వీకెండ్‌లో తెలుగు రాష్ట్రాల్లో రూ.48.39 కోట్ల(మొదటి రోజు25.49 కోట్లు, రెండో రోజు 12.32 కోట్లు, మూడో రోజు 10.58 కోట్లు) షేర్ వసూలు చేసిన ఈ సినిమా సోమవారం రూ. 2.11 కోట్లు, మంగళవారం రూ.1.14 కోట్లకు పడిపోయింది. ఇటీవల కాలంలో ఓ పెద్ద సినిమాకి నాలుగు రోజు నుంచే ఈ స్థాయిలో కలెక్షన్స్ పడిపోవడం రాధేశ్యామ్ విషయంలోనే జరిగింది.
204 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన రాధేశ్యామ్ ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 77.20 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల బిజినెస్ చేసిన రాధేశ్యామ్.. ఐదు రోజుల్లో 51.64 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లో 11.02 కోట్లు రాబట్టిన రాధేశ్యామ్.. హిందీలో 8 కోట్లు కలెక్ట్ చేసింది. రెస్టాఫ్ ఇండియా 6.54 కోట్లు వసూలు చేసింది. రాధేశ్యామ్ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఓవరాల్ గా ఇంకా126.80 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అందులో 30 శాతం కూడా కలెక్ట్ చేసే అవకాశం కనిపించట్లేదు. అదే జరిగితే ప్రభాస్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోనుంది రాధేశ్యామ్.
టాలీవుడ్ లో బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', మహేష్ బాబు 'స్పైడర్', ప్రభాస్ 'సాహో' మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 123.6 కోట్ల బిజినెస్ చేసిన 'అజ్ఞాతవాసి' మొత్తం 57.5 కోట్ల షేర్ రాబట్టి 66.1 కోట్ల నష్టాన్ని మూట గట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో 60.50 కోట్ల నష్టంతో 'స్పైడర్', 52.15 కోట్ల నష్టంతో 'సాహో' నిలిచాయి. ఇప్పుడు రాధేశ్యామ్ మూవీ 'అజ్ఞాతవాసి'ని మించిన నష్టాలతో భారీ డిజాస్టర్ గా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం హిందీ మూవీ 'ద కశ్మీర్ ఫైల్స్' చిన్న సినిమాగా వచ్చి భారీ కలెక్షన్స్ తో సంచలనం సృష్టిస్తోంది. ఆ సినిమా దూకుడు ముందు హిందీలో రాధేశ్యామ్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతోంది. దానికి తోడు మార్చి 25 న 'ఆర్ఆర్ఆర్' మూవీ విడుదల ఉండటంతో.. మార్చి 24 నాటికి రాధేశ్యామ్ ఫుల్ రన్ దాదాపు పుర్తయినట్లే. ఈ తొమ్మిది రోజుల్లో రాధేశ్యామ్ ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే అంత భారీ నష్టాల నుంచి తప్పించుకోగలదు. అయితే ఫైనల్ గా దాదాపు 100 కోట్ల నష్టం మూటగట్టుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
![]() |
![]() |