![]() |
![]() |

'అఖండ'తో బ్లాక్ బస్టర్ అందుకొని సక్సెస్ జోష్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలయ్య తన 107 వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఆయన పాత్ర ఫస్ట్ లుక్ ని, పాత్ర పేరుని రివీల్ చేశారు మేకర్స్.
ఇప్పటికే 'NBK 107' నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రీసెంట్ టైమ్స్ లో బాలయ్య బెస్ట్ లుక్స్ లో ఒకటి అంటూ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. ఇక బాలయ్యని ఢీ కొట్టే పాత్రలో నటిస్తున్న దునియా విజయ్ లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఇందులో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో దునియా విజయ్ కనిపించనున్నాడని తెలుపుతూ తాజాగా ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. నోట్లో సిగరెట్ పెట్టుకొని ఉన్న దునియా విజయ్ లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఇదిలా ఉంటే, ముసలి మడుగు అనేది కర్నూల్ జిల్లాలోని ఒక ఊరు పేరు. చూస్తుంటే ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న సినిమా అని తెలుస్తోంది.

ఈ మూవీలో బాలయ్య కు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |