![]() |
![]() |

బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ వెండితెరపైనా అలరిస్తోంది. 'గుంటూరు టాకీస్' వంటి సినిమాతో ఆకట్టుకున్న రష్మి పలు సినిమాల్లో లీడ్ రోల్ లో నటించింది. అయితే ఒక సినిమా సమయంలో రష్మీని ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టేసి కొడతానని ఓ నిర్మాత బెదిరించారు. ఈ విషయాన్ని ఆ నిర్మాతే స్వయంగా చెప్పడం విశేషం.
'రాణి వారి బంగ్లా' సినిమా సమయంలో తాను రష్మీకి వార్నింగ్ ఇచ్చానని, అయితే దాని వెనక ఓ బలమైన కారణముందని సీనియర్ నిర్మాత బాలజీ నాగలింగం అన్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'రాణి వారి బంగ్లా' సినిమా సమయంలో రష్మీతో జరిగిన వివాదం గురించి ఆయన చెప్పారు. ఆ సినిమా దాదాపు పూర్తయ్యి.. ఒక సాంగ్, డబ్బింగ్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో హీరోని మార్చాలంటూ రష్మీ పేచీ పెట్టిందని అన్నారు. అంతేకాదు, నాగబాబు గారు తెలుసు. మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారు తెలుసు, మీడియాకి ఎక్కిస్తా అంటూ బెదిరింపులకు దిగిందని తెలిపారు. దీంతో ఆయనకు కోపమొచ్చి తాను ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నానంటూ ఫైర్ అయ్యారట. సినిమా మధ్యలో వదిలేస్తే న్యాయపరమైన చర్యలకు దిగుతానని, ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టేస్తానని వార్నింగ్ ఇచ్చానంటూ నాగలింగం చెప్పారు.
అయితే ఒప్పుకున్న రెమ్యునరేషన్ తీసేసుకుని, చివర్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతోనే రష్మీని నిజాయతీగా ఉండమని బెదిరించాను అంటూ నాగలింగం చెప్పుకొచ్చారు. మూడు నెలల పాటు సినిమాను ఆపిన రష్మీ, చివరికి వచ్చి పూర్తి చేసిందని అన్నారు. అయితే నటిగా మాత్రం రష్మీని తక్కువ చేయలేమని, బాగా నటించిందని నాగలింగం కొనియాడారు.
![]() |
![]() |