![]() |
![]() |

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిసున్న లేటెస్ట్ మూవీ 'మిషన్ ఇంపాజిబుల్'. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ స్వరూప్ దర్శకుడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసి టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
'మిషన్ ఇంపాజిబుల్' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు అరెస్టు. ఆ తర్వాత 'అరెస్ట్, ఇన్ఫ్లుయెన్స్, బెయిల్.. ఈ సైకిల్ కి బాగా అలవాటు పడిపోయాడు' అంటూ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా తాప్సీ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆమె, ఆమె బృందం ఓ మిషన్‌ను నిర్వహించడం దాదాపు అసాధ్యమని భావించినప్పుడు.. భారతదేశపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ముగ్గురు పిల్లలు ప్రయత్నిస్తుండటంతో.. తాప్సీ ఆ పిల్లల ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఆ పిల్లలతో కలిసి తాప్సీ, ఆమె టీమ్ ఇంపాజిబుల్ అనుకున్న మిషన్ ని ఎలా పూర్తి చేశారు అన్నదే సినిమా. ట్రైలర్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కామెడీ హైలైట్ గా నిలిచింది. 'ఆర్జీవీ', 'త్రివిక్రమ్', 'ఆర్ఆర్ఆర్' రిఫరెన్స్ లతో ఆ పిల్లలు చెప్పిన డైలాగ్స్ నవ్వులు పూయిస్తున్నాయి.

దీపక్ యెరగరా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిషన్ ఇంపాజిబుల్ ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదల అవుతుంది.
![]() |
![]() |