![]() |
![]() |

పారితోషికం విషయంలో `తగ్గేదేలే` అన్నట్లుగా మాస్ మహారాజా రవితేజ వ్యవహరిస్తుంటారన్నది టాలీవుడ్ టాక్. అంతేకాదు.. రెమ్యూనరేషన్ విషయంలో రాజీ కుదరక కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆయన వదులుకున్నారని చెప్పుకుంటుంటారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. రవితేజ పారితోషికం ఇప్పుడు రూ.16 కోట్ల నుంచి రూ. 18 కోట్ల వరకు పలుకుతోందట.
ఇదిలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న `మెగా 154`లో రవితేజ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రవితేజ 20 రోజులు కాల్షీట్స్ కేటాయించారట. అంతేకాదు.. రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు వినికిడి. తన అభిమాన నటుడితో చాలా కాలం తరువాత కలిసి నటించబోయే సినిమా అయినప్పటికీ.. రవితేజ మాత్రం షాకింగ్ రెమ్యూనరేషన్ అందుకోనుండడం వార్తల్లో నిలుస్తోంది. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.
Also Read: వైఎస్ జగన్ తో భేటీపై రాజమౌళి కామెంట్స్.. కొంచెం ఇష్టం కొంచెం కష్టం!
కాగా, ప్రస్తుతం రవితేజ చేతిలో `రామారావు ఆన్ డ్యూటీ`, `ధమాకా`, `రావణాసుర`, `టైగర్ నాగేశ్వర రావు` చిత్రాలు ఉన్నాయి. వీటిలో `రామారావు ఆన్ డ్యూటీ` వేసవి కానుకగా జనం ముందుకు రాబోతోంది.
![]() |
![]() |