![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `గాడ్ ఫాదర్` ఒకటి. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `లూసీఫర్`కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాని `హనుమాన్ జంక్షన్` ఫేమ్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ ప్రధాన పాత్రని పోషిస్తోంది. కాగా, ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన తాజా షెడ్యూల్ ముంబయిలో జరుగుతోంది. అక్కడ ప్రముఖ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన ఓ సెట్ లో చిరు, సల్మాన్ కాంబినేషన్ లో కీలక సన్నివేశాలని పిక్చరైజ్ చేస్తున్నట్లు బజ్.
Also Read: షాకింగ్.. పరుచూరి వెంకటేశ్వరరావు ఇప్పుడిలా అయిపోయారు!
ఇదిలా ఉంటే, `గాడ్ ఫాదర్`తో ఓ సీనియర్ యాక్ట్రస్ రి-ఎంట్రీ ఇవ్వబోతోందట. ఆమె మరెవరో కాదు.. భారతీరాజా రూపొందించిన `సీతాకోకచిలక`తో కథానాయికగా అలరించిన ముచ్చర్ల అరుణ. అయితే, అరుణ ఏ పాత్రలో కనిపించబోతుందన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఇదివరకు చిరంజీవి కథానాయకుడిగా నటించిన `ఆలయ శిఖరం`, `చంటబ్బాయ్`, `యుద్ధ భూమి`, `అత్తకు యముడు - అమ్మాయికి మొగుడు` వంటి సినిమాల్లో అరుణ కీలక పాత్రల్లో ఆకట్టుకుంది. మరి.. రి-ఎంట్రీలోనూ అరుణ నటిగా తనదైన ముద్ర వేస్తుందేమో చూడాలి.
![]() |
![]() |