![]() |
![]() |

బాలీవుడ్ లో కథానాయికగా ఆలియా భట్ కెరీర్ ప్రారంభమై పదేళ్ళు కావస్తోంది. 2012 చివరలో రిలీజైన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్`తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆలియా.. ఆపై పలు హిట్స్ తో స్టార్ స్టేటస్ కి చేరుకుంది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటీమణిగా అనతికాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆలియా భట్.
ఇదిలా ఉంటే, ఒకవైపు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లో నటిస్తూనే.. మరోవైపు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ తోనూ ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది ఆలియా. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇప్పటివరకు ఆలియా నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అన్నీ కూడా మంచి ఫలితాన్నే అందించాయి. `హై వే` (2014), `డియర్ జిందగీ` (2016), `రాజీ` (2018).. ఇలా ఇదివరకు ముచ్చటగా మూడుసార్లు నాయికా ప్రాధాన్య చిత్రాలతో మురిపించిన ఆలియా.. తాజాగా విడుదలైన `గంగూబాయి కథియావాడి`తో మరోమారు రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. మొత్తమ్మీద.. ఆలియాకి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ బాగానే అచ్చొస్తున్నాయనే చెప్పొచ్చు.
కాగా, ఆలియా తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` ఈ నెల 25న విడుదలకు సిద్ధమైంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ లో అభినయానికి ఆస్కారమున్న పాత్రలోనే అలరించనుంది ఆలియా.
![]() |
![]() |