![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ.. ఇలా తెలుగునాట రెండు తరాల అగ్ర కథానాయకులందరితోనూ కలిసి పనిచేయడమే కాకుండా వారి కాంబినేషన్స్ లో ఘనవిజయాలు అందుకున్న ఘనత రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ది. అంతేకాదు.. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితం కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ తనదైన బాణీలు పలికించాడు దేవి శ్రీ. అలాగే ఆయా భాషల్లో టాప్ స్టార్స్ తోనూ జట్టుకట్టి సక్సెస్ అయ్యాడు. అలాంటి డీఎస్పీకి మార్చి 12 ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. సంగీత దర్శకుడిగా తన తొలి ప్రయత్నమైన `దేవి` చిత్రం 23 ఏళ్ళ క్రితం అంటే 1999లో ఇదే రోజున రిలీజైంది.
Also Read: శర్వానంద్ తో కృతి శెట్టి రొమాన్స్!?
శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన ఈ డివోషనల్ ఫాంటసీ మూవీకి.. జనరంజక బాణీలు అందించడమే కాకుండా కథానుగుణమైన నేపథ్యసంగీతం కూడా సమకూర్చి ఆ సినిమాకి ఓ ఎస్సెట్ అయ్యాడు దేవి శ్రీ ప్రసాద్. `దేవి` చిత్రం ప్రారంభయ్యే సమయానికి టీనేజ్ ప్రాయంలోనే ఉన్న దేవి శ్రీ.. రిలీజ్ నాటికి 20 ఏళ్ళు కూడా పూర్తిచేసుకోకపోవడం విశేషం. ఏదేమైనా, ప్రతిభకి వయసుతో సంబంధం లేదు అని నిరూపించి.. మొదటి సినిమాతోనే మెమరబుల్ హిట్ సొంతం చేసుకున్నాడు డీఎస్పీ. ``కుంకుమ పూలతోటలో``, ``నీనవ్వే నాగస్వరమే``, ``రామ చిలుకల`` వంటి చార్ట్ బస్టర్స్ తో పాటు కథలో భాగమైన డివోషనల్ సాంగ్స్ కి కూడా ఆకట్టుకునే స్వరాలు సమకూర్చి సంగీత ప్రియుల మది దోచాడు దేవి. కథానాయిక ప్రేమ టైటిల్ రోల్ లో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్మెస్ రాజు నిర్మించిన `దేవి`.. కాస్త ఆలస్యంగా థియేటర్స్ లోకి వచ్చినా దేవి శ్రీ ప్రసాద్ కి మంచి శుభారంభం ఇచ్చింది. నేటితో 23 వసంతాల కెరీర్ పూర్తిచేసుకున్న దేవి శ్రీ ప్రసాద్.. మున్ముందు కూడా మరిన్ని మ్యూజికల్ హిట్స్ తో అలరించాలని ఆకాంక్షిద్దాం.
![]() |
![]() |