![]() |
![]() |

`ధృవ`, `సైరా.. నరసింహారెడ్డి` వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తరువాత స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి నుంచి రాబోతున్న సినిమా `ఏజెంట్`. స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో యంగ్ హీరో అక్కినేని అఖిల్ టైటిల్ రోల్ లో దర్శనమివ్వనుండగా.. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఓ ముఖ్య పాత్రలో ఎంటర్టైన్ చేయనున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అఖిల్ కి జంటగా డెబ్యూ బ్యూటీ సాక్షి వైద్య సందడి చేయనుండగా.. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కథను అందించాడు. కాగా, పంద్రాగస్టు ప్రత్యేకంగా ఆగస్టు 12న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో ఇదే ఆగస్టు నెలలో సురేందర్ రెడ్డి రూపొందించిన `కిక్ 2` (2015) రిలీజైంది. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచిన ఆ సినిమా తరువాత.. మళ్ళీ అదే నెలలో రాబోతున్న సురేందర్ చిత్రం `ఏజెంట్`నే కావడం గమనార్హం. మరి.. తనకి అచ్చిరాని ఆగస్టు నెలలో వస్తున్న `ఏజెంట్`.. సురేందర్ రెడ్డికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
![]() |
![]() |