![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కి ద్విపాత్రాభినయం కొత్తేమీ కాదు. `వాలి` (1999), `సిటిజన్` (2001), `విలన్` (2002), `అట్టహాసం`(2004), `బిల్లా`(2007), `అసల్`(2010) వంటి సినిమాల్లో రెండేసి పాత్రల్లో ఆకట్టుకున్నారు అజిత్. అలాగే `వరలారు` (2006) కోసం ఏకంగా మూడు పాత్రల్లో మెస్మరైజ్ చేశారు. కట్ చేస్తే.. సుదీర్ఘ విరామం అనంతరం మరోమారు డ్యూయెల్ రోల్స్ లో ఎంటర్టైన్ చేయబోతున్నారు ఈ టాప్ స్టార్.
Also Read: పూజ వద్దనుకుంటే.. రష్మిక ముద్దనుకుందా!?
ఆ వివరాల్లోకి వెళితే.. `నేర్కొండ పార్వై`, `వలిమై` చిత్రాల తరువాత దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్ లో అజిత్ మరో సినిమా చేయబోతున్నారు. `నేర్కొండ పార్వై`, `వలిమై` సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత బోనీ కపూర్.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా నిర్మించనున్నారు. కాగా, అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ లో అజిత్ రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారట. అంతేకాదు.. అందులో ఒకటి నెగటివ్ రోల్ అని సమాచారం. గతంలో `వాలి` చిత్రంలో అజిత్ తనే హీరోగా, తనే విలన్ గా అభినయించి ఆకట్టుకున్నారు. అదే తీరున.. రాబోయే సినిమాతోనూ మురిపిస్తారేమో చూడాలి.
![]() |
![]() |