![]() |
![]() |
.webp)
`డార్లింగ్` ప్రభాస్ కి అచ్చొచ్చిన కో-స్టార్స్ లో కోలీవుడ్ సీనియర్ యాక్టర్ సత్యరాజ్ ఒకరు. `మిర్చి` (2013), `బాహుబలి - ది బిగినింగ్` (2015), `బాహుబలి - ది కంక్లూజన్` (2017) తో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ అందుకుంది. ఇక ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమైన `రాధే శ్యామ్`లోనూ సత్యరాజ్ సందడి చేయనున్నారు. తెలుగులో రెబల్ స్టార్ కృష్ణంరాజు పోషించిన పరమహంస పాత్రని ఇతర భాషల్లో సత్యరాజ్ చేశారు.
ఇదిలా ఉంటే, త్వరలో ప్రభాస్ తో మరోసారి సత్యరాజ్ జట్టుకట్టనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ప్రభాస్ ఓ చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు టాక్. కాగా, ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రని సత్యరాజ్ ధరించనున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి కూడా క్లారిటీ రానుంది.
Also Read: మరో క్రేజీ ప్రాజెక్ట్ లో రష్మిక.. విజయ్ తో తగ్గేదేలే
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇప్పటికే మారుతి డైరెక్ట్ చేసిన `ప్రతి రోజూ పండగే`(2019)లో ఓ ప్రధాన పాత్ర పోషించిన సత్యరాజ్.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న `పక్కా కమర్షియల్`లోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సో.. ప్రభాస్ ప్రాజెక్ట్ తో మారుతి - సత్యరాజ్ మూడోసారి టీమ్ అప్ అయ్యే అవకాశముందన్నమాట.
![]() |
![]() |