![]() |
![]() |

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్' విడుదల సమయం ఆసన్నమైంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. మార్చి 25 న విడుదల కానున్న ఈ భారీ మల్టీస్టారర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రేక్షకులకు మరింత అనుభూతిని ఇవ్వడం కోసం ఆర్ఆర్ఆర్ ని ఐమాక్స్ రీమాస్టర్ వెర్షన్ లో విడుదల చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీ ఐమాక్స్ వెర్షన్ లో భారీగా విడుదల కానుంది. 70 ఎంఎం స్క్రీన్ పై క్వాలిటీ వీడియో, ఆడియోని ఆడియెన్స్ ఎక్స్ పీరియన్స్ చేయనున్నారు. ఇండియాతో పాటు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వంటి దేశాలలో భారీగా విడుదలవుంటున్న ఈ మూవీ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అంతేకాదు వరల్డ్ లోనే బిగ్గెస్ట్ స్క్రీన్ పై ఆర్ఆర్ఆర్ మూవీ ప్రదర్శించబోతున్నారు. ఆర్ఆర్‌ఆర్ ప్రీమియర్ యూకేలోని ఓడియన్ బీఎఫ్‌ఐ ఐమ్యాక్స్ థియేటర్‌లో ప్రదర్శించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఆ స్క్రీన్ పై ప్రదర్శించబడలేదు. బడా బడా బాలీవుడ్ సినిమాలను సైతం ఇప్పటిదాకా ఆ స్క్రీన్ పై ప్రదర్శించలేదు. దీంతో వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ పై ప్రదర్శించబడిన మొదటి ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ క్రియేట్ చేయనుంది.
![]() |
![]() |