![]() |
![]() |

శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి నటిగా నిరూపించుకొని, ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా భిన్న పాత్రల్ని పోషించి పేరు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు తెలుగు సినిమాలతో బిజీగా మారింది. రవితేజ 'క్రాక్' సినిమాలో జయమ్మ పాత్రలో వరలక్ష్మి ప్రదర్శించిన అభినయం తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. నెగటివ్ రోల్ అయినప్పటికీ ఆమెను జనం ఇష్టపడ్డారంటే.. అది ఆమె అభినయ సామర్థ్యానికి నిదర్శనం. ఆ వెంటనే వచ్చిన అల్లరి నరేశ్ 'నాంది' మూవీలో లాయర్ ఆద్యగా కనిపించి, తన అభిమానుల సంఖ్యను పెంచుకుంది.
కట్ చేస్తే.. వరలక్ష్మి చేతిలో ఇప్పుడు అరడజను తెలుగు సినిమాలున్నాయని తెలుస్తోంది. వాటిలో బాలకృష్ణతో గోపీచంద్ మలినేని తీస్తున్న సినిమా, సమంత మూవీ 'యశోద', సందీప్ కిషన్ సినిమా 'మైఖేల్', ప్రశాంత్‌వర్మ ఫిల్మ్ 'హనుమాన్' లాంటివి ఉన్నాయి. మార్చి 5న వరలక్ష్మి బర్త్‌డే సందర్భంగా ఆయా సినిమాల నిర్మాతలు ఆమె కోసం స్పెషల్ పోస్టర్లను రిలీజ్ చేసి, బర్త్‌డే విషెస్ చెప్పారు.
తెలుగు చిత్రపరిశ్రమ, ఇక్కడి ప్రేక్షకులు తనను ఆదరిస్తున్న తీరుతో చెన్నై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చింది వరలక్ష్మి. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఆమె తెలియజేసింది. "I had the best birthday ever... మంచి కానీ, చెడు కానీ.. ఎప్పుడూ నా కోసం నిలబడ్డ ఈ అద్భుతమైన మనుషులకు థాంక్స్. వారితో చెన్నైలో నా చివరి వీకెండ్‌ను గడిపాను. ఇది నా లైఫ్‌లో కొత్త లైఫ్. హైదరాబాద్?? యస్, అఫిషియల్‌గా నేను హైదరాబాద్‌కు మూవ్ అవుతున్నాను. నాకు భయంగా, నెర్వస్‌గా ఉంది. కానీ నాకు తెలుసు, ఇది మంచి కోసమేనని." అని ఆమె రాసుకొచ్చింది.
![]() |
![]() |