![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2011 లో తన ప్రేయసి స్నేహారెడ్డిని పెళ్లి చేసుకొని వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. ఈరోజుతో వారి పెళ్ళై 11 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా బన్నీ తన కుటుంబంతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాడు.
బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయిస్తూ ఉంటాడు. ప్రతి అకేషన్ కి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాడు. భార్య స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హ లతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. 11 వ పెళ్లిరోజు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి కేక్ కట్ చేశాడు బన్నీ. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.
బన్నీ ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్' తో సంచలన విజయాన్ని అందుకున్నాడు. త్వరలో పుష్ప పార్ట్ 2 తో బిజీ కానున్నాడు.
![]() |
![]() |