![]() |
![]() |

రెబల్ స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'ప్రాజెక్ట్ K'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. దేశం గర్వించదగ్గ విషయమై తమ సినిమాకు మీ మద్దతు కావాలని నాగ్ అశ్విన్ కోరగా.. ఆనంద్ మహీంద్రా వెంటనే అంగీకరించారు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ ట్విట్టర్ వేదికగా ఆనంద్ మహేంద్రను ఒక రిక్వెస్ట్ చేశారు. "డియర్ ఆనంద్ మహీంద్రా సర్. మేం 'ప్రాజెక్ట్ k' అనే సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నాం. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కొన్ని వాహనాలను తయారు చేయిస్తున్నాం. అవి ఇప్పటి టెక్నాలజీని మించి, యూనిక్ గా ఉంటాయి. అంతా అనుకున్నట్లు జరిగితే.. అది మన దేశానికే గర్వకారణం అవుతుంది. మా దగ్గర ఎంతో ప్రతిభావంతులైన ఇంజినీర్లు, డిజైనర్ లు ఉన్నారు. ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇలాంటి ప్రయత్నం ఇంతకు ముందెప్పుడూ ఎవరూ చేయలేదు. మాకు మీ సహకారం కావాలి. మీరు సహకారం అందిస్తే అది మాకు గౌరవంగా భావిస్తాము" అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు.

నాగ్ అశ్విన్ ట్వీట్ కి ఆనంద్ మహీంద్రా రిప్లై ఇచ్చారు. ఇలాంటి అవకాశాన్ని తాను ఎలా వదులుకుంటానని ఆనంద్ మహీంద్రా అన్నారు. తమ సంస్థ తరఫున వేలు మహీంద్రా సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. ఆయన 'XUV 700' డెవలప్ చేశారని, ఇప్పటికే భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తున్నారని ఆనంద్ మహీంద్రా తెలిపారు.
![]() |
![]() |