![]() |
![]() |

దాదాపు రెండేళ్ళ క్రితం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన కోలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ `పెంగ్విన్` (2020).. కేరళకుట్టి కీర్తి సురేశ్ కెరీర్ కి అంతగా ప్లస్ కాలేదు. అయితే, అదే చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన కార్తిక్ పళనికి మాత్రం మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. సినిమా మూడ్ కి తగ్గట్టు కార్తిక్ అందించిన విజువల్స్.. విమర్శకుల మెప్పు పొందాయి. అంతేకాదు.. బిగ్ టికెట్ ఫిల్మ్స్ కి రెడ్ కార్పెట్ పరిచాయి.
Also Read: 'రాధేశ్యామ్' కొత్త ట్రైలర్.. ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్నంటాయి!
ఈ క్రమంలోనే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ ఫిల్మ్ `ఆది పురుష్`కి కెమెరామేన్ గా పనిచేసే లక్కీ ఛాన్స్ కొట్టేసిన కార్తిక్ పళని.. తాజాగా మరో భారీ బడ్జెట్ మూవీకి కూడా ఛాయాగ్రహణం అందించే అవకాశాన్ని పొందాడని బజ్. ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ విజయ్ కథానాయకుడిగా టాలీవుడ్ కెప్టెన్ వంశీ పైడిపల్లి తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ అందించనున్నాడని సమాచారం. అదే గనుక నిజమైతే.. కార్తిక్ కి ఇది మరో గోల్డెన్ ఛాన్సే. మరి.. ఫస్ట్ ప్రభాస్.. నెక్స్ట్ విజయ్ అన్నట్లుగా 2023లో రాబోతున్న ఈ బడా ప్రాజెక్ట్స్ తో కార్తిక్ పళని కెరీర్ మరో స్థాయికి వెళుతుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే, ఇదివరకు కార్తిక్ పళని తెలుగులో `నెక్స్ట్ నువ్వే` (2017), `బ్రాండ్ బాబు` (2018) చిత్రాలకు కెమెరామేన్ గా పనిచేశాడు.
![]() |
![]() |