![]() |
![]() |

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలలో శర్వానంద్ బెస్ట్ యాక్టర్స్ లో ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 'అమ్మ చెప్పింది', 'గమ్యం', 'ప్రస్థానం', 'శతమానం భవతి' వంటి సినిమాలతో ఆకట్టుకున్న శర్వానంద్ ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' కూడా డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో హిట్ కోసం శర్వానంద్ ఇంకొంతకాలం ఎదురు చూడక తప్పేలా లేదు.
శర్వానంద్ చివరిసారిగా 2017 లో విజయాన్ని అందుకున్నాడు. ఆ ఏడాది 'శతమానం భవతి', 'రాధ', 'మహానుభావుడు' సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన శర్వా.. 'రాధ'తో నిరాశపరిచినప్పటికీ మిగతా రెండు సినిమాలతో హిట్ కొట్టాడు. అప్పటి నుంచి ప్రతి ఏడాది కనీసం ఒక సినిమాను విడుదల చేస్తున్న ఈ యంగ్ హీరో విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. 2018 లో 'పడి పడి లేచే మనసు', 2019 లో 'రణరంగం', 2020 లో 'జాను' సినిమాలు విడుదల కాగా ఇవేవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక 2021 లో శర్వా నటించిన 'శ్రీకారం', 'మహాసముద్రం' సినిమాలు విడుదలయ్యాయి. 'శ్రీకారం' సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.
నాలుగైదేళ్లుగా విజయం కోసం ఎదుచూస్తున్న శర్వా ఇప్పుడు 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాతో వచ్చాడు. అయితే ఈ సినిమాతో కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఈ సినిమా సంక్రాంతికి వచ్చి ఉంటే అంతో ఇంతో ఆడేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే థియేటర్స్ లో 'భీమ్లా నాయక్' ఉంది. ఈ నెల 11 న 'రాధేశ్యామ్' విడుదల కానుంది. ఈ పెద్ద సినిమాల నడుమ డివైడ్ టాక్ తో శర్వా కమర్షియల్ సక్సెస్ అందుకోవడం కష్టమే. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే శర్వా నటించిన ఆరు వరుస సినిమాలు ఫ్లాప్ అయినట్లే. అంటే ఫ్లాప్స్ తో డబుల్ హ్యాట్రిక్ కొట్టినట్లు అన్నమాట. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఒకే ఒక జీవితం' తోనైనా శర్వా హిట్ కొడతాడేమో చూడాలి.
![]() |
![]() |