![]() |
![]() |

ఫలితాల సంగతి పక్కన పెడితే.. సూపర్ స్టార్ రజినీకాంత్ గత మూడు చిత్రాలు `పేట్ట`(2019), `దర్బార్`(2020), `అణ్ణాత్త` (2021) (తెలుగులో `పెద్దన్న`) కూడా ఫెస్టివల్స్ ని టార్గెట్ చేసుకునే రిలీజయ్యాయి. `పేట్ట`, `దర్బార్` వేర్వేరు సంవత్సరాల్లో పొంగల్ స్పెషల్ గా విడుదల కాగా.. `అణ్ణాత్త` నిరుడు దీపావళిని లక్ష్యంగా చేసుకుని సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసింది.
Also Read: Bheemla Nayak Locks OTT release date
కట్ చేస్తే.. రజినీకాంత్ తదుపరి చిత్రం (`తలైవర్ 169` అనేది వర్కింగ్ టైటిల్) కూడా ఈ జాబితాలో చేరనుందట. ఆ వివరాల్లోకి వెళితే.. `కోలమావు కోకిల`, `డాక్టర్`, `బీస్ట్` సినిమాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో రజినీకాంత్ ఓ మూవీ చేయబోతున్నారు. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతమందించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో రజినీకి జంటగా ఐశ్వర్యా రాయ్ నటించనుందని సమాచారం. కాగా, ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్. అంతేకాదు.. 2023 పొంగల్ కి లేదా అదే ఏడాది తమిళ సంవత్సరాది(ఏప్రిల్ 14)కి `తలైవర్ 169`ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి.. మరోసారి ఫెస్టివల్ నే టార్గెట్ చేసుకుని రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో.. సూపర్ స్టార్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |