![]() |
![]() |

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'హనుమాన్'. తేజ సూపర్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీని పాన్-ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్‌రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో గత ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ చేసిన తేజ ఫస్ట్ లుక్‌కు, డిసెంబర్‌లో రిలీజ్ చేసిన హీరోయిన్ అమృతా అయ్యర్ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు 'హనుమాన్'లో అత్యంత కీలక పాత్ర చేస్తోన్న వరలక్ష్మీ శరత్‌కుమార్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో ఆమె అంజమ్మ అనే దమ్మున్న క్యారెక్టర్ చేస్తున్నారు. పెళ్లి కూతురుగా ముస్తాబై, చేతిలో కొబ్బరి బోండాల గెల పట్టుకొని రౌడీలను చితక్కొడుతున్న అంజమ్మగా వరలక్ష్మి లుక్ వేరే లెవల్‌లో ఉండి ఆకట్టుకుంటోంది. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్, "Introducing the Mighty “Makkal Selvi” as the braveheart #Anjamma from the World of Anjanadri" అంటూ రాసుకొచ్చారు. దాన్ని బట్టి వరలక్ష్మి చేస్తోన్న క్యారెక్టర్ ఎంత శక్తిమంతంగా ఉండబోతోందో ఊహించుకోవచ్చు. పేరునుబట్టి చూస్తే ఆమె హీరో తేజకు తల్లిగా కనిపిస్తారని ఊహించవచ్చు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌లోనో, లేక సినిమా ఓపెనింగ్‌లో వచ్చే సీన్‌లోనో ఆమె ఇలా యంగ్‌గా కనిపిస్తారనిపిస్తోంది.
'జాంబీరెడ్డి' మూవీ తర్వాత తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీకి శివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తుండగా, అనుదీప్ దేవ్, హరిగౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్. శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటర్‌గా పనిచేస్తుండగా, అశ్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

![]() |
![]() |