![]() |
![]() |

2019 క్రిస్మస్ స్పెషల్ గా రిలీజైన సల్మాన్ ఖాన్ `దబాంగ్ 3`తో కథానాయికగా తొలి అడుగేసింది సయీ మంజ్రేకర్. ప్రముఖ దర్శకుడు, నటుడు మహేశ్ మంజ్రేకర్ తనయగా ఎంట్రీగా ఇచ్చిన సయీకి ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. అయినప్పటికీ, టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందిపుచ్చుకుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఆ చిత్రాలే.. `గని`, `మేజర్`.
Also Read: 'పఠాన్' రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్.. డెఫినెట్లీ కింగ్ ఈజ్ బ్యాక్!
స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన `గని`లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి జంటగా `మాయ` పాత్రలో నటించిన సయీ మంజ్రేకర్.. బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కిన `మేజర్`లో టాలెంటెడ్ హీరో అడివి శేష్ కి జోడీగా `ఇషా` పాత్రలో అభినయించింది. కాగా, ఈ రెండు సినిమాలు కూడా వరుస నెలల్లో థియేటర్స్ బాట పడుతున్నాయి. ఏప్రిల్ 8న `గని` ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మే 27న పలు భాషల్లో `మేజర్` సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. మరి.. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో సయీ మంజ్రేకర్ ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
ఇదిలా ఉంటే, `గని`ని డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కించగా.. `మేజర్`ని `గూఢచారి` ఫేమ్ శశి కిరణ్ తిక్క రూపొందించాడు.
![]() |
![]() |