![]() |
![]() |

ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన యువ కథానాయకుల్లో శర్వానంద్ ఒకరు. కేవలం ఆ తరహా చిత్రాలకే పరిమితం కాకుండా.. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు శర్వా.
ఇదిలా ఉంటే.. `పడి పడి లేచె మనసు`, `రణరంగం`, `జాను`, `శ్రీకారం`, `మహా సముద్రం` వంటి ఐదు వరుస పరాజయాల తరువాత `ఆడవాళ్ళు మీకు జోహార్లు`తో పలకరించబోతున్నాడు శర్వానంద్. నేషనల్ క్రష్ రష్మికా మందన్న కథానాయికగా నటించిన ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాని `నేను శైలజ` ఫేమ్ కిశోర్ తిరుమల తెరకెక్కించాడు. రాధిక, ఖుష్బూ, ఊర్వశి వంటి అలనాటి అగ్ర నాయికలు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. మార్చి 4న థియేటర్స్ లోకి రాబోతోంది.ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో మార్చి నెలలో వచ్చిన శర్వానంద్ చిత్రాలేవీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. `నువ్వా నేనా` (2012), `జేకే ఎన్నుమ్ నన్బనిన్ వాళకై` (తమిళ్ - 2015), `శ్రీకారం`(2021).. ఇలా వేర్వేరు సంవత్సరాల్లో మార్చి నెల వేదికగా జనం ముందు నిలిచిన ఈ చిత్రాలేవీ శర్వా కెరీర్ కి అంతగా ప్లస్ కాలేకపోయాయి. ఈ నేపథ్యంలో.. `ఆడవాళ్ళు మీకు జోహార్లు`తోనైనా మార్చి నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి.. శర్వా ఓ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి. అలాగే, ఐదు వరుస అపజయాల తరువాత వస్తున్న `ఆడవాళ్ళు..` మూవీతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడా? లేదా? అన్నది కూడా ఆసక్తికరమే.
![]() |
![]() |