![]() |
![]() |

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'పొన్నియన్ సెల్వన్'. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ఇలా ఎందరో స్టార్స్ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ పలు భాగాలుగా విడుదల కానుంది. తాజాగా ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ తో పాటు, ఐదుగురు స్టార్ల ఫస్ట్ లుక్స్ ని విడుదల చేశారు.

పొన్నియన్ సెల్వన్ అనే చారిత్రక నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి భాగాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 30 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ల ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. విక్రమ్, జయం రవి ఆయుధాలు పట్టుకొని రాజుల్లా ఉండగా, కార్తీ లుక్ మాత్రం విభిన్నంగా రాక్షస లుక్ ని తలపిస్తోంది. ఇక ఐశ్వర్య రాయ్, త్రిష రాణుల లుక్ లో ఆకట్టుకుంటున్నారు.

మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాతో మణిరత్నం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.


![]() |
![]() |