![]() |
![]() |

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ చేసిన పనికి 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్ ఫిదా అయింది. 'ఆర్ఆర్ఆర్' కోసం తన సినిమా 'డాన్'ని పోస్ట్ చేయడానికి అంగీకరించిన శివ కార్తికేయన్ కి ఆర్ఆర్ఆర్ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేసింది.
శివ కార్తికేయన్ తమిళ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. 'రెమో', 'వరుణ్ డాక్టర్' సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చెన్నైలో జరిగిన 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్ లోనూ పాల్గొన్నాడు. ఆర్ఆర్ఆర్ ని మొదట జనవరి 7న విడుదల చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్.. ఆ సమయంలో ముంబై, చెన్నై నగరాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు. చెన్నై ఈవెంట్ కి గెస్ట్ గా శివ కార్తికేయన్ హాజరయ్యాడు. అయితే కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ మార్చి 25 కి వాయిదా పడింది. అయితే అప్పటికే శివ కార్తికేయన్ తన 'డాన్' సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ కోసం ఆ డేట్ ని త్యాగం చేశాడు.

మార్చి 25 న ఆర్ఆర్ఆర్ విడుదల ఉండటంతో, డాన్ సినిమాని వాయిదా వేయడానికి శివ కార్తికేయన్ అంగీకరించారని లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెలిపింది. మే 13 న డాన్ విడుదల కానుందని కొత్త విడుదల తేదీని ప్రకటించింది. డాన్ సినిమాని నిర్మిస్తున్న లైకా సంస్థ ఆర్ఆర్ఆర్ మూవీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండటం విశేషం.

శివ కార్తికేయన్ కి ఆర్ఆర్ఆర్ టీమ్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపింది. తమపై ప్రేమాభిమానాలు చూపించడంలో శివ కార్తికేయన్ ముందు వరుసలో ఉంటారని ట్వీట్ చేసింది.
![]() |
![]() |