![]() |
![]() |

ఒక్కో నిర్మాణ సంస్థకి ఒక్కో నెల భలేగా అచ్చొస్తుంటుంది. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ కి అనుబంధ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ కి కూడా అలా ఓ నెల కలిసొస్తోంది. తాజా చిత్రం `భీమ్లా నాయక్` ఘనవిజయంతో ఆ సెంటిమెంట్ మరింత బలపడినట్లయ్యింది.
ఆ వివరాల్లోకి వెళితే.. రెండేళ్ళ క్రితం అంటే 2020లో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన `భీష్మ` చిత్రం.. ఇదే ఫిబ్రవరి నెలలో విడుదలైంది. నితిన్, రష్మికా మందన్న జంటగా వెంకీ కుడుముల రూపొందించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఆపై ఇదే నెలలో రెండేళ్ళ తరువాత రెండు సినిమాలతో పలకరించింది సితార. ఆ చిత్రాలే.. `డీజే టిల్లు`, `భీమ్లా నాయక్`.
సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో నటించిన `డీజే టిల్లు` ఈ ఫిబ్రవరి 12న రిలీజై తొలి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకుని.. ఓవరాల్ గా సూపర్ హిట్ గా నిలిచింది. అదే విధంగా.. ఈ రోజు (ఫిబ్రవరి 25) జనం ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టిస్టారర్ `భీమ్లా నాయక్` కూడా మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మొత్తమ్మీద.. `భీష్మ`, `డీజే టిల్లు` తరువాత `భీమ్లా నాయక్`తో ఫిబ్రవరి నెల వేదికగా సితార ఖాతాలో హ్యాట్రిక్ సెన్సేషన్ చేరిందనే చెప్పాలి. మరి.. భవిష్యత్ లోనూ ఫిబ్రవరి మాసంలో సితార సంస్థ మరిన్ని విజయాలు అందుకుంటుందేమో చూడాలి.
![]() |
![]() |