![]() |
![]() |

పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేసిన 'భీమ్లా నాయక్' మూవీలో డానియల్ శేఖర్ అనే కీలక పాత్ర చేశాడు రానా దగ్గుబాటి. సినిమా అంతా ఆ ఇద్దరి క్యారెక్టర్ల చుట్టూనే తిరుగుతుంది. ఒక ఇన్సిడెంట్ సందర్భంగా పరస్పరం తారసపడి, గొడవ పడిన ఆ ఇద్దరూ.. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ఎంత దూరం వెళ్లారనేది ప్రధానాంశం. ట్రైలర్‌లో డానియల్ శేఖర్‌గా రానా ప్రెజెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. రామ్‌చరణ్ సైతం ట్రైలర్‌లో రానా పర్ఫార్మెన్స్, ప్రెజెన్స్ టాప్ నాచ్‌లో ఉన్నాయని మెచ్చుకున్నాడు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'భీమ్లా నాయక్' ప్రిరిలీజ్ ఈవెంట్‌లో రానా స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంది. పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేసినప్పుడు ఆయన ప్రభావానికి లోనయ్యానని చెప్పిన రానా, ఇకనుంచీ తన సినిమాలు కొత్తగా ఉంటాయని అనడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
రానా మాట్లాడుతూ ‘‘నేను యాక్టర్ అయ్యి 12 ఏళ్లు అయింది. దర్శకులు చెప్పినట్లు నాకు ఇచ్చిన పాత్రలన్నీ చేసుకెళ్లిపోయాను. ఏదోలా యాక్టర్ అయ్యా. కానీ హీరో ఎలా అవ్వాలనే కాన్సెప్ట్ బుర్రలో తిరుగుతూనే ఉంది. అప్పుడు నా కళ్ల ముందుకొచ్చిన హీరో.. పవన్‌కల్యాణ్. ఇండియాలో చాలామంది స్టార్‌లతో కలిసి చేశాను కానీ.. అందులో పవన్ కల్యాణ్ డిఫరెంట్. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒకలా ఉంటే ఇప్పుడు రాబోయే చిత్రాలన్నీ పవన్‌కల్యాణ్ ప్రభావంతో కొత్తగా ఉంటాయి." అని చెప్పాడు.
ఆ తర్వాత త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ, "నేను కలిసిన మరో మేధావి త్రివిక్రమ్‌గారు. ఆయన పొరపాటున సినిమాల్లోకి వచ్చారు కానీ బయట ఉండి ఉంటే రాకెట్‌లను మార్స్‌కి ఎగరేసేవారు. అలాంటి తత్వం ఆయనది. ఈ సినిమాలో మంచి ఆర్టిస్ట్‌లతో పనిచేశా. సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలో ఇండియన్ సినిమాకు హైదరాబాద్ క్యాపిటల్ కానుంది’’ అని అన్నాడు.
![]() |
![]() |