![]() |
![]() |

మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్, లిరిక్ రైటర్ సుద్దాల అశోక్ తేజ కాంబినేషన్ లో వచ్చిన 'లవ్ స్టోరి' మూవీలోని 'సారంగదరియా' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబోలో 'గాంధారి' మ్యూజిక్ వీడియో వచ్చింది. అంతేకాదు ఈ మ్యూజిక్ వీడియోలో మహానటి కీర్తి సురేష్ కనువిందు చేయడం విశేషం.
గాంధారి మ్యూజిక్ వీడియోని సోమవారం విడుదల చేశారు. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ చేయడంతో పాటు దర్శకత్వం వహించిన ఈ మ్యూజిక్ వీడియోలో కీర్తి సురేష్ తనదైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, స్టెప్స్ తో అలరించింది. "గాంధారి గాంధారి మీ మరిది గాంధారి దొంగ చందమామలాగ వంగి చూసిండే" అంటూ సాగిన ఈ సాంగ్ లిరిక్స్ క్యాచీగా ఆకట్టుకునేలా ఉన్నాయి. పవన్ సీహెచ్ మరోసారి తనదైన సంగీతంతో సత్తాచాటాడు. అనన్య భట్ ఈ పాటకి ఆలపించింది. బృందా మాస్టర్ ఈ సాంగ్ ని కలర్ ఫుల్ గా, బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు. ఓవరాల్ గా ఈ మ్యూజిక్ వీడియో మెప్పిస్తోంది.
సినిమాల విషయానికొస్తే, మహేష్ బాబు సరసన కీర్తి నటిస్తోన్న 'సర్కారు వారి పాట' మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే చిరంజీవి సోదరిగా నటిస్తున్న 'భోళా శంకర్'తో పాటు పలు సినిమాలు కీర్తి చేతిలో ఉన్నాయి.
![]() |
![]() |