![]() |
![]() |

వైవిధ్యానికి పెద్దపీట వేసే నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఆయన నటించిన డిఫరెంట్ మూవీస్ లో `ఘాజీ`కి ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ పిరియడ్ డ్రామా.. హిందీలో `ద ఘాజీ అటాక్` పేరుతో తెరకెక్కింది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తొలి ప్రయత్నంగా రూపొందిన ఈ సినిమాలో తాప్సీ, కేకే మీనన్, అతుల్ కులకర్ణి, ఓమ్ పురి, నాజర్, మిలింద్ గునాజీ, సత్యదేవ్, రవివర్మ, ప్రియదర్శి, భరత్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
భారత తూర్పు తీరంలో అనుమానస్పదంగా ధ్వంసమై మునిగిపోయిన పాకిస్తాన్ కి చెందిన సబ్ మెరీన్ ఘాజీ.. మిస్టరీ వెనుక అసలేం జరిగి ఉంటుంది? అనే పాయింట్ ని బేస్ చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు సంకల్ప్. 123 నిమిషాల నిడివితో సాగిన ఈ చిత్రానికి నటీనటుల అభినయం, కాన్సెప్ట్, సాంకేతిక నిపుణుల పనితీరు ప్రధాన బలంగా నిలిచాయి.
Also Read: బాలయ్యతో మరోసారి మీరా జాస్మిన్!?
పీవీపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన `ఘాజీ`.. 65వ జాతీయ పురస్కారాల్లో `ఉత్తమ ప్రాంతీయ చిత్రం` (తెలుగు) కేటగిరిలో అవార్డు అందుకుంది. 2017 ఫిబ్రవరి 17న విడుదలై మంచి విజయం సాధించిన `ఘాజీ`.. నేటితో ఐదు వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |