![]() |

`మగధీర` వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన సినిమా `ఆర్ ఆర్ ఆర్`. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చరణ్ నటించిన ఈ మల్టిస్టారర్.. మార్చి 25న జనం ముందుకు రానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు. అంటే.. చరణ్ బర్త్ డే స్పెషల్ గా `ఆర్ ఆర్ ఆర్` రెండు రోజుల ముందే రాబోతుందన్నమాట. కాగా, రామ్ చరణ్ కెరీర్ లో ఇప్పటివరకు అతని పుట్టినరోజు కానుకగా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. మరి.. చరణ్ బర్త్ డే స్పెషల్ గా రాబోతున్న ఫస్ట్ ఫిల్మ్ గా `ఆర్ ఆర్ ఆర్`.. తనకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read: ప్రభాస్ తో `మాస్టర్` బ్యూటీ!?
ఇదిలా ఉంటే, డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన `ఆర్ ఆర్ ఆర్`లో రామ్ చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కనిపించనుండగా, తారక్ జోడీగా విదేశీ సోయగం ఒలివియా మోరీస్ దర్శనమివ్వనుంది. అజయ్ దేవగణ్, శ్రియ మరో జంటగా నటించిన ఈ భారీ బడ్జెట్ మూవీకి స్వరవాణి కీరవాణి బాణీలు అందించారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ కి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చారు.
![]() |