![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటజీవితంలో ప్రత్యేకంగా నిలిచే సినిమాల్లో `మురారి` ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన ఈ ఫ్యామిలీ డ్రామాలో మురారిగా టైటిల్ రోల్ లో తనదైన అభినయంతో మురిపించారు మహేశ్. అంతేకాదు.. తన నటనతో `నంది స్పెషల్ జ్యూరీ`ని సైతం కైవసం చేసుకున్నారు. మహేశ్ కి జోడీగా సోనాలి బింద్రే నటించిన ఈ సినిమాలో లక్ష్మి, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతి రావు, సుకుమారి, అన్నపూర్ణ, సుధ, హేమ, అనితా చౌదరి, ప్రసాద్ బాబు, రఘు బాబు, రవి బాబు, చిన్నా, లక్ష్మీపతి ఇతర ముఖ్య పాత్రల్లో అలరించగా ప్రకాశ్ రాజ్, అచ్యుత్, ఎమ్మెస్ నారాయణ, నాగబాబు అతిథి పాత్రల్లో దర్శనమిచ్చారు.
Also Read: బాలయ్య చిత్రంలో శ్రీ లీల!?
మెలోడీబ్రహ్మ మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం `మురారి`కి ఎస్సెట్ గా నిలిచాయి. ఇందులోని ``అలనాటి రామచంద్రుని`` అంటూ సాగే గీతం ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలవగా.. ``ఎక్కడ ఎక్కడ ఉందో తారక``, ``చెప్పమ్మా చెప్పమ్మా``, ``బంగారు కళ్ళ``, ``అందానికే``, ``భామా భామా``, ``డుమ్ డుమ్ డుమ్`` పాటలు కూడా విశేషాదరణ పొందాయి. ద్వితీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ గుణచిత్ర నటి (లక్ష్మి) విభాగాల్లోనూ `నంది` పురస్కారాలు అందుకున్న `మురారి`ని.. రామ్ ప్రసాద్ ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. 2001 ఫిబ్రవరి 17న విడుదలై మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన `మురారి`.. నేటితో 21 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |