![]() |
![]() |

'డియర్ మేఘ' లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత మేఘా ఆకాశ్ మరో మంచి లవ్ స్టొరీ సైన్ చేసింది. ఈ చిత్రానికి 'డియర్ మేఘ' దర్శకుడు సుశాంత్ రెడ్డి కథ అందించడం విశేషం. అంతేకాదు నిర్మాణంలో కూడా ఆయన పాలు పంచుకుంటున్నారు. ఈ సినిమాకి మేఘ తల్లి బిందు ఆకాశ్ సమర్పకురాలిగా వ్యవహరిస్తుండటం ఇంకో విశేషం. సుశాంత్ రెడ్డి ఎ., అభిషేక్ కోట నిర్మాణంలో, కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది.
మేఘా ఆకాశ్ హీరోయిన్ గా రూపొందబోతున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి అసోసియేట్ అభిమన్యు బడ్డి దర్శకుడు. ఈ విషయాన్ని నిర్మాతలు తెలియజేస్తూ, "డియర్ మేఘ లాంటి హిట్ చిత్రం తరువాత మేఘా ఆకాశ్‌తో మా కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం పై చాలా అంచనాలున్నాయి. దర్శకుడు అభిమన్యు బడ్డి పై మాకు చాలా నమ్మకముంది. ముఖ్య నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నాం. షూటింగ్ కూడా అతి త్వరలో మొదలవుతుంది." అని వెల్లడించారు.
ఈ చిత్రానికి హరిగౌర సంగీతం సమకూరుస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా ఎంపికయ్యారు.

![]() |
![]() |