![]() |
![]() |

'డీజే టిల్లు' మూవీ టీమ్ విజయవాడ కాపిటల్ మాల్ లో సందడి చేసింది. థియేటర్ లో 'డీజే టిల్లు' సినిమా చూస్తూ నవ్వుల్లో మునిగిపోయిన ప్రేక్షకులకు ఆ మూవీ హీరో హీరోయిన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. అప్పటివరకు స్క్రీన్ మీద సందడి చేసిన హీరో హీరోయిన్ ఒక్కసారిగా ఎదురుగా ప్రత్యక్షమవ్వడంతో ప్రేక్షకుల ఆనందంతో ధియేటర్ మారుమ్రోగింది.
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'డీజే టిల్లు'. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ శుక్రవారం విడుదలైన 'డీజే టిల్లు' ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా 'డీజే టిల్లు' టీమ్ విజయయాత్ర లో భాగంగా విజయవాడ కాపిటల్ మాల్ ని సందర్శించారు. ఆడియన్స్ తో కలసి సినిమా చూసిన టీం తమ ఆనందాన్ని ప్రేక్షకులతోనూ మీడియాతోనూ పంచుకున్నారు.

ఈసందర్భంగా హీరో సిద్దు జోన్నలగడ్డ మాట్లాడుతూ.. "తెలంగాణ యాస తో వస్తున్నాం.. నైజాం వరకు మాకు ఎలాంటి సందేహాలు లేవు.. కానీ ఆంధ్రాలో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే డౌట్ ఉండేది. కానీ ఈరోజు విజయవాడలో ఆడియన్స్ తో కలసి చూసాక మంచి సినిమా ఎక్కడైనా మంచి సినిమానే అని ప్రేక్షకులు రుజువు చేసారు. చాలా ఆనందంగా ఉంది. 'డీజే టిల్లు' అనే క్యారెక్టర్ రాయడం, చేయడం ఒక కత్తిమీద సాము లాంటిది. కానీ ప్రేక్షకులు మాకు మేం ఊహించిన దానికంటే పెద్ద విజయం అందించారు. ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన కిక్ ఎప్పటికీ మరిచిపోలేను. మిమ్మల్ని ఏడిపించేంత నవ్విస్తాడు టిల్లు దానికి నాది గ్యారెంటీ" అన్నారు.
దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ.. "ఈ విజయంతో ఏం మాట్లాడాలో అర్దం కావడం లేదు. ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్. మా నమ్మకాన్ని పదింతలు చేసి ప్రేక్షకులు మాకు విజయం అందించారు. ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేయడంలోనూ సిద్దూ పాత్ర చాలా ఉంది. విజయవాడ లో ప్రేక్షకుల రెస్పాన్స్ మా ఆనందాన్ని పదింతలు చేసింది" అన్నారు.
హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ.. "నా మొదటి థియేటర్ విజిట్ ఇది. నా సినిమా ఆడియన్స్ తో చూడటం ఎప్పటికీ గుర్తుండి పోతుంది. థియేటర్ లో రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. డీజే టిల్లు ఒక సూపర్ ఫన్ రైడ్ .. ప్రేక్షకులు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది" అన్నారు.
![]() |
![]() |