![]() |
![]() |

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న థియేటర్స్ లో విడుదల కానుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది.
'ఆడవాళ్ళు మీకు జోహార్లు' షూటింగ్ పూర్తయినట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వివాహ వేడుక సెటప్ తో పోస్టర్ ఆకట్టుకుంటోంది. వధువు రష్మిక పదిపదిహేను మంది ఆడవారి మధ్య నిల్చొని ఉండగా, వరుడు శర్వానంద్ మోకాళ్లపై కూర్చొని సరదాగా దణ్ణం పెడుతున్నట్లుగా పోస్టర్ లో ఉంది. రష్మిక సిగ్గు, మిగతా వారి చిరునవ్వులతో పోస్టర్ కలర్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉంది. అలాగే ఈ సినిమాని ముందుగా అనుకున్నట్లు ఫిబ్రవరి 25 నే విడుదల చేస్తున్నట్లుగా పోస్టర్ లో క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ ముఖ్య పాత్రల్లో నటించారు.
![]() |
![]() |