![]() |
![]() |

అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర జనవరిలో సరిగా ఆడిన తెలుగు సినిమా లేదు. సంక్రాంతికి విడుదలైన నాగార్జున, నాగచైతన్య సినిమా 'బంగార్రాజు' సైతం యు.ఎస్.ఎ.లో ఫ్లాపయింది. అయితే 2022లో అక్కడి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోన్న తొలి సినిమాగా నిలిచింది ఇటీవల విడుదలైన 'డీజే టిల్లు'. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కొత్త దర్శకుడు విమల్ రాజ్ రూపొందించిన ఈ సినిమా ఈ ఏడాది యు.ఎస్.ఎ. బాక్సాఫీస్ దగ్గర హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ యు.ఎస్.ఏ.లో ప్రీమియర్స్‌తో కలుపుకొని, కేవలం రెండు రోజుల్లోనే 3 లక్షల డాలర్లను వసూలు చేయడం విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేసింది. ప్రీమియర్స్ ద్వారానే లక్ష డాలర్లను రాబట్టి సర్‌ప్రైజ్ చేసిన ఈ సినిమా ఆ తర్వాత కూడా తన హవాను కొనసాగిస్తోంది. తొలిరోజే అక్కడ బ్రేకీవెన్ సాధించిన 'డీజే టిల్లు', అక్కడి డిస్ట్రిబ్యూటర్ రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు రెండో రోజు నుంచి లాభాలను అందివ్వడం మొదలెట్టేసింది.
మరోవైపు మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ చేసిన 'ఖిలాడి' యు.ఎస్.ఎ.లో డిజాస్టర్‌గా నిలిచింది. నాలుగు రోజులకు గాను 'ఖిలాడి' వసూలు చేసిన మొత్తం కేవలం 90 వేల డాలర్లు మాత్రమే.
![]() |
![]() |