Home  »  News  »  ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లి ఎందుకు కాలేదు!

Updated : Feb 14, 2022

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటూ విపరీతంగా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ అమ్మాయితో త్వరలో పెళ్లి, ఈ హీరోయిన్ తో పెళ్లి అంటూ రకరకాల వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే నిజంగా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటే మాత్రం ఎవరి దగ్గరా సరైన సమాధానం లేదు. ఇదిలా ఉంటే, నీకింకా పెళ్లి ఎందుకు కాలేదంటూ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా ప్రభాస్ ని అడిగేసింది. అయితే అది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో.

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'రాధే శ్యామ్'. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మూవీ టీమ్ కూడా ఈ సినిమాతో ప్రేక్షకులు ప్రేమలో పడటం గ్యారెంటీ అంటూ కాన్ఫిడెంట్ గా ఉంది.

ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి వాలెంటైన్స్ డేకి సర్ ప్రైజ్ రాకపోతే ఎలా?. అందుకే వాలెంటైన్స్ డే కానుకగా స్పెషల్ గ్లింప్స్ ని విడుదల చేసింది మూవీ టీమ్. 33 సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. 'మళ్ళీ లైఫ్ లో వాడి మొహం చూడను' అంటూ పూజా చెప్పే డైలాగ్ తో ప్రారంభమై.. 'ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లి ఎందుకు కాలేదు' అంటూ పూజా చెప్పే డైలాగ్ తో గ్లింప్స్ ఆకట్టుకుంది. పెళ్లి ఎందుకు కాలేదు అంటూ పూజా అడిగిన సమయంలో ప్రభాస్ తడబడుతూ ఇచ్చిన రియాక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.