![]() |
![]() |

చాలా కాలంగా అభిమానులను ఎదురుచూపుల్లో ఉంచుతున్న మార్వెల్ స్టూడియోస్ ఎట్టకేలకు 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్' ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా ఇండియాలో మే 6న రిలీజవుతోంది. మార్వెల్ కామిక్స్ క్యారెక్టర్ డాక్టర్ స్ట్రేంజ్ ఆధారంగా ఈ సూపర్‌హీరో ఫిల్మ్‌ను సామ్ రైమి డైరెక్ట్ చేశాడు.
వేలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్' ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మరోసారి మన మనసులను ఆహ్లాదరపర్చడానికి బెనెటిక్ట్ కుంబర్‌బ్యాచ్ రెడీ అవుతున్నాడని ఆ ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. మల్టీవర్స్ కొలాప్స్ అవుతుందనే బెదిరింపును డాక్టర్ స్ట్రేంజ్ ఎదుర్కోవడాన్ని మనం చూడొచ్చు. ఇండియాలో ఈ సినిమా ఇంగ్లీష్ ఒరిజినల్ వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ డబ్బింగ్ వెర్షన్లతోనూ మే 6న విడుదల కానున్నది.
ఈ మూవీలో చివెటెల్ ఎజియోఫర్, ఎలిజబెత్ ఓల్సెన్, బెనెడిక్ట్ వాంగ్, క్సోచిల్ గోమెజ్, మైఖేల్ స్టూల్‌బర్గ్, రాచెల్ మెక్ఆడమ్స్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
![]() |
![]() |