![]() |
![]() |

విజయ్ శంకర్ హీరోగా, బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం 'ఫోకస్'. సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలక పాత్రలు చేస్తోన్న ఈ చిత్రంతో సూర్యతేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఫోకస్’ మూవీ రూపొందుతోంది.
వాలెంటైన్స్ డే కానుకగా 'ఫోకస్' మూవీ నుండి స్పెషల్ పోస్టర్‌ను విడుదలచేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో విజయ్ శంకర్, అషు రెడ్డి ఒకరినొకరు హత్తుకుని నవ్వుతూ కనిపిస్తున్నారు. ఈ రొమాంటిక్ పోస్టర్ వాలెంటైన్స్ డేకి పర్‌ఫెక్ట్ ఛాయిస్ అనేలా ఉంది. త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్ర బృందం.
విజయ్ శంకర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా సుహాసిని మణిరత్నం జడ్జి పాత్రలో కనిపించనున్నారు. భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. వినోద్ యాజమాన్య సంగీతం సమకూరుస్తుండగా, కాసర్ల శ్యామ్ పాటలు రాశారు. జె. ప్రభాకర్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.

![]() |
![]() |