![]() |
![]() |
.webp)
తెలుగునాట రీమేక్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుల్లో భీమనేని శ్రీనివాసరావు ఒకరు. కెరీర్ ఆరంభంలో ఆయన రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో `శుభాకాంక్షలు` ఒకటి. తమిళ చిత్రం `పూవే ఉనక్కాగ` (విజయ్, సంగీత, అంజు అరవింద్) ఆధారంగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో జగపతి బాబు, రవళి, రాశి హీరోహీరోయిన్లుగా నటించారు. సూపర్ స్టార్ కృష్ణ ఓ ప్రత్యేక గీతంలో దర్శనమిచ్చిన ఈ చిత్రంలో సత్యనారాయణ, షావుకారు జానకి, నగేశ్, సుకుమారి, ఆనంద్ రాజ్, దేవన్, బ్రహ్మానందం, ఏవీయస్, వై.విజయ, సుధాకర్, మల్లికార్జున రావు, మహర్షి రాఘవ, సుధ, రజిత ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఆల్పోన్సా, రంజిత స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు.
Also Read: 'ఎఫ్ 3'కి కొత్త రిలీజ్ డేట్.. ఏప్రిల్ నుంచి మే కు వాయిదా!
కోటి, ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతమందించిన ఈ చిత్రంలో.. ``ఆనందమానందమాయే`` గీతం చార్ట్ బస్టర్ గా నిలిచింది. అలాగే ``గుండె నిండా గుడిగంటలు``, ``మనసా పలకవే``, ``అద్దంకి చీర``, ``పంచవన్నెల చిలక``, ``ఓ పోరి పానిపూరి`` వంటి పాటలు కూడా ఆకట్టుకున్నాయి. శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఎస్. నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన `శుభాకాంక్షలు`.. 1997 ఫిబ్రవరి 14న విడుదలైంది. నేటితో ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ పాతికేళ్ళు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |