![]() |
![]() |

'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన యంగ్ బ్యూటీ కృతి శెట్టి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇటీవల 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' సినిమాలతో వరుస విజయాలు అందుకొని ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. అందులో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బైలింగువల్ మూవీ 'ది వారియర్' ఒకటి. తాజాగా ఈ సినిమా నుంచి కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్.
'బంగార్రాజు' సినిమాలో నాగలక్ష్మిగా అలరించిన కృతి శెట్టి 'ది వారియర్'లో మహాలక్ష్మిగా సందడి చేయనుంది. 'ది వారియర్' సినిమాలో విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి కనిపించనుందని తెలుపుతూ వాలెంటైన్స్ డే కానుకగా నేడు మూవీ టీమ్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో స్కూటీపై మోడ్రన్ లుక్ లో ఉన్న కృతి లుక్ ఆకట్టుకుంటోంది. విజిల్ మహాలక్ష్మిగా నటిస్తున్న కృతి తన పాత్రకి విజిల్స్ పడేలా చేస్తుందేమో చూడాలి.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. వారియర్ ని విజిల్ మహాలక్ష్మి ప్రేమలో ఎలా పడేస్తుందో చూద్దాం.
![]() |
![]() |