![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ - అగ్ర దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డిది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు మ్యూజికల్ గా మెప్పించాయి. వాటిలో `ధర్మ క్షేత్రం` ఒకటి. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరసారథ్యంలో రూపొందిన ఈ సినిమాలోని పాటలన్నీ సంగీత ప్రియులను విశేషంగా అలరించాయి. మరీముఖ్యంగా.. ``ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదీ వెన్నెలమ్మ`` ఎవర్ గ్రీన్ రొమాంటిక్ నంబర్ గా నిలిచింది. అలాగే ``చెలి నడుమే అందం``, ``ముద్దుతో శృంగార బీటు``, ``అరె ఇంకా జంక``, ``పెళ్ళికి ముందు ఒకసారి``, ``కొరమీను కోమలం`` గీతాలు కూడా రంజింపజేశాయి. వీటిలో ``అరె ఇంకా జంక``, ``పెళ్ళికి ముందు``కి `సిరివెన్నెల` సీతారామశాస్త్రి పదరచన చేయగా, మిగిలిన పాటలు వేటూరి సుందరరామ్మూర్తి కలం నుంచి జాలువారాయి.
Also Read: 'కళావతి' సాంగ్ లీక్.. 'సర్కారు వారి పాట' మేకర్స్ ఫైర్!
అడ్వకేట్ బెనర్జీగా బాలకృష్ణ నటించిన ఈ కోర్ట్ డ్రామాలో దివ్యభారతి కథానాయికగా అలరించగా జగ్గయ్య, నాజర్, రామిరెడ్డి, జయలలిత, దేవన్, శ్రీహరి, బ్రహ్మాజీ, సాక్షి రంగారావు, పోసాని కృష్ణ మురళి, జ్యోతి, సుధారాణి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. పరుచూరి బ్రదర్స్ కథ, సంభాషణలు అందించిన ఈ చిత్రాన్ని శ్రీ రాజీవ్ ప్రొడక్షన్స్ పతాకంపై కేసీ రెడ్డి నిర్మించారు. 1992 ఫిబ్రవరి 14న విడుదలై మ్యూజికల్ హిట్ గా నిలిచిన `ధర్మక్షేత్రం`.. నేటితో 30 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |