![]() |
![]() |

చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి సెంటిమెంట్స్ బాగా హైలైట్ అవుతుంటాయి. మాస్ మహారాజా రవితేజ కూడా ఇలాంటి సెంటిమెంట్స్ కి అతీతుడు కాదు. అదేమి చిత్రమో కానీ.. ఫిబ్రవరి నెలలో రవితేజ హీరోగా వచ్చే సినిమాలన్నీ బాక్సాఫీస్ రిజల్ట్స్ పరంగా చుక్కలు చూపిస్తున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. సరిగ్గా 16 ఏళ్ళ క్రితం `షాక్` (2006) చిత్రంతో కథానాయకుడి హోదాలో ఫిబ్రవరిలో తొలిసారిగా సందడి చేశాడు రవితేజ. హరీశ్ శంకర్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా.. టైటిల్ కి తగ్గట్టే షాక్ ఇచ్చింది. ఆపై ఆరేళ్ళ తరువాత `నిప్పు` (2012)తో చాన్నాళ్ళకి ఫిబ్రవరిలో జనం ముందు నిలిచాడు మాస్ మహారాజా. గుణశేఖర్ రూపొందించిన ఈ సినిమా కూడా డిజప్పాయింట్ చేసింది. ఆనక మళ్ళీ ఆరేళ్ళ అనంతరం `టచ్ చేసి చూడు` (2018)తో ఇంకోసారి ఫిబ్రవరిలో సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చాడు రవితేజ. నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ తెరకెక్కించిన ఈ మూవీ కూడా నిరాశపరిచింది.
Also Read: 13 ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో విహారయాత్రకు..!
కట్ చేస్తే.. నాలుగేళ్ళ తరువాత మరల ఇప్పుడు `ఖిలాడి`గా అదే ఫిబ్రవరిలో వస్తే.. నెగటివ్ టాక్ తో పాటు వసూళ్ళు కూడా అంత ఇంప్రెసివ్ గా లేవు. రమేశ్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తో రవితేజ ఖాతాలో మరో ఫ్లాప్ చేరడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మొత్తానికి `క్రాక్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజకి.. `ఖిలాడి` రూపంలో మళ్ళీ అపజయం ఎదురైందనే చెప్పాలి. ఏదేమైనా.. రవితేజకి ఫిబ్రవరి నెల అంతగా కలిసి రావడం లేదన్నది స్పష్టం. మరి.. భవిష్యత్ లోనైనా ఈ నెగటివ్ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |