![]() |
![]() |

టాలీవుడ్ హీరోల రేంజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. 'బాహుబలి'తో ప్రభాస్, 'పుష్ప'తో అల్లు అర్జున్ నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' మూవీ ఇంకా విడుదల కాకముందే జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. టీజర్, ట్రైలర్ లో తారక్ నటనకి నార్త్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె సైతం తారక్ ను ప్రశంసించడమే కాకుండా, అతనితో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. ఈ క్రమంలో ఊసరవెల్లి ఫేమ్ పాయల్ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తారక్ గ్లోబర్ స్టార్ అని, ఇక బాలీవుడ్ పనైపోయిందని ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

తారక్ గురించి దీపిక చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పోస్ట్ ని ట్విట్టర్ షేర్ చేసిన పాయల్.. వరుస ట్వీట్స్ తో తారక్ ని ఆకాశానికెత్తింది. "తారక్ తో కలిసి పనిచేసేందుకు బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు క్యూ కడుతున్నారు. నేను ఇప్పటికే ఊసరవెల్లి సినిమాలో అతనితో కలిసి నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. చూస్తూ ఉండండి.. త్వరలోనే దక్షిణాది చిత్రపరిశ్రమ బాలీవుడ్ ను కైవసం చేసుకుంటుంది. అసభ్య పదజాలం, అభ్యంతరకర సన్నివేశాలను ఇకనైనా సినిమాల్లో చూపించడం మానేయకపోతే బాలీవుడ్ అంతం కాక తప్పదు."
"తారక్ గ్లోబల్ స్టార్, ఉన్నతమైన వ్యక్తి, ముఖ్యంగా అతనో ఆల్రౌండర్ సూపర్ స్టార్. ఇవన్నీ చెప్తుంటే గతంలో నన్ను నిందించారు. కానీ నేను అతడివైపే నిలబడ్డాను. ఈ రోజు నేను చెప్పిందే నిజమైంది" అంటూ పాయల్ ట్విట్టర్ వేదికగా తారక్ ని ప్రశంసించింది.
![]() |
![]() |