![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `రాధే శ్యామ్`. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ పిరియడ్ లవ్ సాగాలో ప్రభాస్ కి జంటగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే దర్శనమివ్వనుంది. `జిల్` రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్.. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయనుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. దర్శకుడు రాధాకృష్ణ తొలి చిత్రం `జిల్` కూడా 2015లో ఇదే మార్చి నెలలో విడుదలైంది. మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన సదరు స్టైలిష్ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ ముంగిట చెప్పుకోదగ్గ విజయం సాధించింది. మరి.. దాదాపు ఏడేళ్ళ తరువాత అదే యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో అదే మార్చి నెలలో మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాధాకృష్ణకి ఈ సారి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.
Also Read: మహేశ్ చిన్నప్పటి రోల్‌లో మేనల్లుడు!
ఇదిలా ఉంటే.. `రాదే శ్యామ్`లో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా.. భాగ్యశ్రీ, జయరామ్, సచిన్ ఖేద్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జకోబ్, సాషా చెట్రి ఇతర ముఖ్య పాత్రల్లో అభినయించారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించారు.
![]() |
![]() |