![]() |
![]() |

కన్నడ చిత్రం `ఒంద్ కథె హేళ్ళా`తో కథానాయికగా తొలి అడుగేసిన ప్రియాంక అరుళ్ మోహన్.. ఆపై నేచురల్ స్టార్ నాని నటించిన `గ్యాంగ్ లీడర్`తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తన హోమ్లీ లుక్స్ తో ఓ వర్గం ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఆపై మరో యువ కథానాయకుడు శర్వానంద్ సరసన `శ్రీకారం`లో సందడి చేసింది. ఇందులో మాత్రం కాస్త మోడ్రన్ టచ్ ఇచ్చింది ప్రియాంక. అయితే తెలుగునాట తొలి, మలి చిత్రాలు ఈ ముద్దుగుమ్మకి ఆశించిన విజయాలనైతే అందించలేకపోయాయి.
ఈ నేపథ్యంలో.. తమిళనాట ఈ ముద్దుగుమ్మ చేసిన తొలి చిత్రం `డాక్టర్` అనూహ్య విజయం సాధించింది. ఆ సినిమా విడుదలకు ముందే.. సూర్యతో `ఎదర్కుమ్ తుణిందవన్`, `డాక్టర్` స్టార్ శివ కార్తికేయన్ తోనే `డాన్` సినిమాలకు ఓకే చెప్పింది. కట్ చేస్తే.. ఇప్పుడీ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా రెండు వారాల గ్యాప్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. మార్చి 10న `ఎదర్కుమ్ తుణిందవన్` విడుదల కానుండగా.. మార్చి 25న `డాన్` తెరపైకి రాబోతోంది. మరి.. రెండు వారాల వ్యవధిలో రానున్న ఈ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ తో ప్రియాంక అరుళ్ మోహన్ ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |