![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు కొరటాల శివ రూపొందించిన `ఆచార్య` విడుదలకు సిద్ధమవుతుండగా.. మరోవైపు మోహన్ రాజా డైరెక్టోరియల్ `గాడ్ ఫాదర్` చిత్రీకరణ దశలో ఉంది. అలాగే.. `మెగా 154` (బాబీ డైరెక్టోరియల్), `భోళా శంకర్` (మెహర్ రమేశ్ దర్శకుడు) ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్నాయి. ఈ చిత్రాలన్నీ కూడా వచ్చే ఏడాది థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ వివరాల్లోకి వెళితే.. `ఛలో`, `భీష్మ` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్న యువ దర్శకుడు వెంకీ కుడుముల.. ఇటీవల మెగాస్టార్ ని సంప్రదించి ఓ ఆసక్తికరమైన కథని వినిపించారట. అది నచ్చడంతో చిరు ఈ ప్రాజెక్ట్ కి వెంటనే ఓకే చెప్పారని బజ్. అంతేకాదు.. ఈ చిత్రాన్ని `ఆర్ ఆర్ ఆర్` నిర్మాత డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే చిరు - వెంకీ కుడుముల కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది. మరి.. మెగాస్టార్ కాంబినేషన్ మూవీతో వెంకీ హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి.
![]() |
![]() |