![]() |
![]() |

సంపూర్ణేష్ బాబు అంటే పాపులర్ యాక్టర్. కానీ నరసింహాచారి అంటే ప్రేక్షకుల్లో ఎవరికీ తెలీదు. అవును.. సంపూర్ణేష్ అసలు పేరు నరసింహాచారి. తెరపై సంపూర్ణేష్‌బాబుగా రాణించే తాను తెరబయట నరసింహాచారిగానే బతుకుతున్నానని ఆయనంటాడు. తెలుగువన్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పాడు. "నా జీవితంలో కెమెరా ముందు సంపూర్ణేష్‌బాబులా ఉన్నా. కెమెరా తర్వాత నరసింహాచారిలా బతుకుతున్నా. ఇప్పుడు మావూరెళ్లిపోతా. మా ఇంట్లోకి ఏవైనా సరుకులు అవసరమైతే బండిమీద వెళ్లిపోయి తెచ్చుకుంటా. సిద్దిపేటలో బైక్ వేసుకొని ప్రశాంతంగా తిరుగుతా. మా ఊరెళ్తే నన్నెవరూ పట్టించుకోరు. చారి వచ్చాడన్నట్లే ఉంటుంది. నేను ఈ రెండు జీవితాలనూ ఎంజాయ్ చేస్తున్నా." అని చెప్పాడు సంపూర్ణేష్ బాబు.
ఆయనది మధ్యతరగతి కుటుంబం. సంపూ సెవెన్త్ క్లాస్‌లో వున్నప్పుడు వాళ్ల నాన్నగారు చనిపోయారు. "అప్పుడు మా ఇద్దరక్కలు బీడీలు చేసేవారు. అలా నేను టెన్త్ వరకు చదువుకున్నా. ఆ తర్వాత గోల్డ్‌వర్క్ నేర్చుకున్నా. దాంట్లో నెలకు పది-పన్నెండు వేలు వస్తే ఫ్యామిలీ, పిల్లలు, షాప్ రెంట్.. అలా గడిచిపోయేది అని వెల్లడించాడు సంపూ.
ఆయన హీరోగా నటించిన క్యాలిఫ్లవర్ సినిమా నవంబర్ 26న థియేటర్లలో విడుదలవుతోంది. శీలో రక్షతి రక్షితః అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమాకు ఆర్కే మలినేని దర్శకుడు.
![]() |
![]() |